pratidwani: ఒలంపిక్స్‌లో పతకాల స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లటం ఎలా ? - prathidhwani debate on Olympic games
యావత్ భారత దేశానికి.. చరిత్రలో గుర్తుండిపోయే ఎన్నో అద్వితీయమైన అనుభూతులను అందించాయి ఒలింపిక్స్ పోటీలు. వందేళ్లకు అథ్లెటిక్స్‌లో భారత్‌కు పతకం లభించింది. బల్లెం వీరుడు నీరజ్ చోప్రా స్వర్ణాన్ని ముద్దాడాడు. క్వార్టర్స్, సెమీస్, ఫైనల్.. అంటూ హాకీ, బాక్సింగ్, రెజ్లింగ్.. గోల్ఫ్‌ను సైతం కోట్లాది మంది భారతీయులు ఆసక్తిగా తిలకించారు. ఉత్కంఠ భరిత కొన్ని పోటీల్లో ఓడినా.. చరిత్ర సృష్టించారు మన క్రీడాకారులు. ఈ క్రమంలోనే పాయింట్ల పట్టికలోనూ మొదటిసారి అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేసుకుంది భారత్. ఈ ఉద్వేగభరిత సంబరాల వేళ గమనించాల్సిన అంశాలు ఏమిటి? ఈ స్ఫూర్తిని మరింతగా ముందకు తీసుకుని వెళ్లాలంటే ఏం చేయాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.