PRATHIDWANI: తూనికలు, కొలతల మోసాలకు అడ్డుకట్ట వేసేదెలా? - తూనికలు, కొలతలపై చర్చ
మార్కెట్లో కొనే వస్తువు ఏదైనా సరే.. కిలో అంటే కిలో కాదు, లీటరంటే లీటర్ కాదు. పెట్రోల్ బంక్ నుంచి కిరాణం దుకాణం దాకా ప్రతీచోటా తూనికలు, కొలతల్లో మోసాలు పెట్రేగిపోతున్నాయి. బరువు తూచే యంత్రాలు, డిజిటల్ మీటర్ల టాంపరింగ్‌తో సామాన్యులు అడుగడుగునా మోసపోతున్నారు. ఉప్పు, పప్పు, బియ్యం, చింతపండు మొదలుకొని పెట్రోల్, గ్యాస్, కూరగాయలు, ధాన్యం దాకా.. అడ్డూఅదుపూ లేకుండా జరుగుతున్న తూనికలు, కొలతల మోసాలకు అడ్డుకట్ట వేసేదెలా? ఇదే అంశంపై ప్రతిధ్వని.