ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

Pratidwani: వైద్యం ఎందుకు ఖరీదైపోతోంది ?..ముకుతాడు వేయడం ఎలా ? - వైద్య ఖర్చులపై ప్రతిధ్వని చర్చ

By

Published : Aug 27, 2021, 9:40 PM IST

అనారోగ్యం పాలై ఆసుపత్రుల్లో చేరుతున్న ప్రజలు వైద్యం కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. గ్రామాల్లో కంటే నగరాల్లో ఈ ఖర్చులు మరింత అధికం. మహిళల కంటే పురుషుల వైద్యానికే ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన వారు సైతం మందులు, వైద్య పరీక్షల కోసం భారీగానే వెచ్చించాల్సి వస్తోంది. ప్రజల్ని ఆర్థికంగా పీల్చి పిప్పిచేస్తున్న వైద్యం ఖర్చులు.. ఏటా కోట్లాది మందిని దారిద్య్రంలోకి నెడుతున్నాయి. అసలు ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెడుతున్న ఖర్చు ఎంత? ప్రభుత్వం, ప్రైవేటు తేడా లేకుండా గంపగుత్తగా వైద్యం ఎందుకు ఖరీదైపోతోంది? ప్రజల్ని ఆర్థికంగా అతలాకుతలం చేస్తున్న వైద్యం ఖర్చులకు ముకుతాడు వేయడం ఎలా? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details