ప్రతిధ్వని: సహకార బ్యాంకింగ్ వ్యవస్థ ఏ మేరకు బలపడుతుంది? - సహకార బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రతిధ్వని చర్చ
సహకార బ్యాంకింగ్ వ్యవస్థను గాడిలో పెట్టడానికి రంగంలోకి దిగిన కేంద్రం ప్రభుత్వం.. బ్యాంకింగ్ క్రమబద్ధీకరణ బిల్లును ఇటీవల పార్లమెంట్లో ఆమోదించింది. దేశవ్యాప్తంగా ఉన్న 1482 పట్టణ, 58 బహుళ రాష్ట్రాల సహకార బ్యాంకులను ఆర్బీఐ పర్యవేక్షణలోకి తెస్తుంది. దీంతో 8 కోట్ల 62 లక్షల ఖాతాదారులు చేసిన 5 లక్షల కోట్ల డిపాజిట్లకు భద్రత చేకూరుతుంది. పంజాబ్, మహారాష్ట్ర సహకార బ్యాంకుల్లో వెలుగుచూసిన భారీ కుంభకోణంతో నమ్మకం సడలిపోయిన నేపథ్యంలో ఆర్బీఐ పర్యవేక్షణతో సహకార బ్యాంకింగ్ వ్యవస్థ ఏమేరకు బలపడుతుందనే అంశంపై ప్రతిధ్వని చర్చ..