PADDY FARMERS PROBLEMS IN EAST GODAVARI : జగన్ సారూ... ఘొల్లున ఏడుస్తున్నాం.. ఆదుకోండి - heavy rains in east godavari district
నట్టింటికి రావాల్సిన ధాన్యలక్ష్మి నడిచేలో కుళ్లిపోతోంది. చేతికందాల్సిన పంట వర్షార్పణమైంది. వర్షానికి వరి వాలిపోయి పూర్తిగా నానిపోయి చేలోనే మొలకెత్తుతోంది. అరకొర ధాన్యాన్ని దక్కించుకునేందుకు తాపత్రయ పడుతున్న అన్నదాతకు కొనుగోలు కొర్రీలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. చివరి గింజ కొనేనాథుడే కనిపించడం లేదని ఆక్రోశిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా ఖరీఫ్(crop damage in east godavari district) రైతులు..!