ఏడో రోజు సతీమణులతో సూర్య, చంద్రప్రభ వాహనసేవలో విహరించిన శ్రీవారు - News today Tirumala srivaaru
తిరుమల శ్రీవారి వార్షక బ్రహ్మోత్సవాలు ఆఖరి దశకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో ఏడో రోజున స్వామివారు ఉదయం సూర్యప్రభ, సాయంత్రం చంద్రప్రభ వాహన సేవలపై దర్శనమిచ్చారు. శనివారం నిర్వహించే సర్వభూపాల, అశ్వవాహన సేవలతో వాహన సేవలు ముగియనున్నాయి. ఆదివారం.. బ్రహ్మోత్సవాల్లో చివరిఘట్టం చక్రస్నానం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 6 నుంచి 9 గంటల మధ్య మహల్ చక్రస్నానం నిర్వహించేందుకు తొట్టెను నిర్మిస్తున్నారు.