'తిని కూర్చోవద్దు..ఆరోగ్యాన్ని కాపాడుకోండి' - ఆహారఅలవాట్లకోసం న్యూట్రీషియన్ టిప్స్
లాక్డౌన్ సమయంలో ఇంట్లో ఉంటున్నాం కదా అని ఏది పడితే అది తినేస్తున్నారా...? అసలు కదలకుండా టీవీకి అతుక్కుపోయి కాలక్షేపం చేసేస్తున్నారా..? సమయం గడిచిపోతోంది కదా అని పూర్తిగా విశ్రాంతి వాతావరణంలో ఉండటం ఎంత మాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. కరోనా ఏ రూపంలో వచ్చినా.. నియంత్రణకు శరీరానికి అందే ఆహారం కూడా ఎంతో ముఖ్యమని సూచిస్తున్నారు. అలాగే అదేపనిగా చిరుతిళ్లు తినటం వల్ల ..అనవసరమైన కొవ్వు శరీరంలో చేరి ఇతర ఇబ్బందులు తలెత్తుతాయి అంటున్న హోలిస్టిక్ న్యూట్రీషియన్ లీలా సుష్మాతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
Last Updated : Apr 1, 2020, 3:17 PM IST