Snow Fall: మంచుదుప్పటి చాటున ప్రకృతి అందాలు - NATURE
రాష్ట్రంలో చలి చంపేస్తోంది. తెల్లవారుజాము నుంచి పెద్దఎత్తున మంచు దుప్పటి కప్పేస్తోంది. పెద్దఎత్తున పొగమంచు కురవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. లైట్లు వేసుకున్నా కనిపించనంతగా పొగమంచు కప్పేస్తోంది. ప్రకాశం జిల్లా చీరాల, అనంతపురం జిల్లా కల్యాణదుర్గం గ్రామీణ ప్రాంతాల్లో పొగమంచుతో ప్రకృతి అందంగా మారింది. మంచుదుప్పటిని చీల్చుకుని వస్తున్న సూర్యకిరణాలు చూపురులకు ఎంతో ఆకట్టుకుంటున్నాయి.