ఇంద్రకీలాద్రి: నేత్రపర్వం.. నటరాజస్వామి కల్యాణోత్సవం - విజయవాడ తాజా వార్తలు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై నటరాజస్వామి ఆరుద్రోత్సవాల్లో భాగంగా.. శివకామ సుందరీదేవి, నటరాజస్వామి కల్యాణం కన్నుల పండువగా జరిగింది. నటరాజస్వామి ఆలయ ప్రాంగణంలో ఉత్సవమూర్తులను వధూవరులుగా అలంకరించిన వేద పండితులు.. అనంతరం మంత్రోచ్ఛరణల మధ్య కల్యాణాన్ని నిర్వహించారు. అభిషేకం, అన్నాభిషేకం శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థాన ఉపాలయమైన నటరాజ స్వామి గుడిలో.. ఈనెల 28 నుంచి ఉత్సవాలు చేస్తున్నారు.