నిబంధనలు అతిక్రమించారు.. లాఠీ దెబ్బలు తిన్నారు..!
కర్నూలు జిల్లా నంద్యాలలో తెల్లవారుజామున రోడ్లపైకి వచ్చిన వారిపై పోలీసులు లాఠీలతో విరచుకుపడ్డారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఉదయం గస్తీ నిర్వహించి వాహనదారులపై చర్యలు తీసుకున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.