ఈటీవీ 25వ వార్షికోత్సవం.. మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు
ఈటీవీ 25వ వార్షికోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి.. శుభాకాంక్షలు తెలిపారు. ప్రథమ వార్షికోత్సవం నుంచి ఇప్పటి వరకు తనకు సంస్థ నుంచి అరుదైన గౌరవం దక్కిందని చెప్పారు. మొదటి, 20వ వార్షికోత్సవాలకు తాను ముఖ్య అతిథిగా హాజరయ్యానని గుర్తు చేసుకున్నారు. టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన ఘనత.. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుదే అని కొనియాడారు.