యానాంలో శివనామస్మరణం.. మహా శివరాత్రి వైభవం - యానాంలో మహాశివరాత్రి న్యూస్
మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా కేంద్ర పాలిత యానం అయ్యన్న నగరంలోని హిందూ సహధర్మప్రచార సంస్థ ఆధ్వర్యంలో.. 108 శివ లింగాల నిమజ్జనం వైభవంగా సాగింది. మట్టితో చేసిన శివలింగాలకు మూడ్రోజుల పాటు పూజలు నిర్వహించిన మహిళలు.. ప్రదర్శనగా తీసుకువెళ్లి గోదావరిలో నిమజ్జనం చేశారు.