MAHAPADAYATRA SPECIAL SONG: మహాపాదయాత్రపై ప్రత్యేక పాట విడుదల - అమరావతి రైతుల పాదయాత్రపై ప్రత్యేక పాట
న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్రపై నిర్వాహకులు విడుదల ప్రత్యేక వీడియోను చేశారు. నవంబర్ 7న తుళ్లూరు నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర ఏడు రోజుల పాటు నిర్విరామంగా సాగింది. కార్తీక సోమవారం దృష్ట్యా 8వ రోజు పాదయాత్రకు విరామం ప్రకటించిన రైతులు నేడు ప్రకాశం జిల్లా ఇంకొల్లు నుంచి కాలినడకను తిరిగి ప్రారంభించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసి డిసెంబర్ 17కి సరిగ్గా రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా తిరుమలలో అదే రోజు పాదయాత్ర ముగించనున్నారు. తొలి ఏడు రోజుల పాటు సాగిన పాదయాత్ర విశేషాలతో కూడిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.