'కార్మికుల నిధులు దారిమళ్లించే యత్నం సరికాదు'
కార్మికులకు లాక్‌డౌన్ సందర్భంగా కల్పించిన వెసులుబాట్లు రాష్ట్రంలో అమలు కావడం లేదని కార్మిక సంఘ నేతలు అంటున్నారు. నిర్మాణరంగం పూర్తిగా నిలిచిపోవడంతో 50 లక్షల మంది ఉపాధిలేక అలమటిస్తున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో కార్మికరంగానికి చేస్తున్న ఉదార సాయం మన రాష్ట్రంలోనూ అమలు చేయాలని వేడుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులు దారిమళ్లించే యత్నం చేయటం సరికాదని వారు హితవు పలుకుతున్నారు. మేస్త్రీలు ఒకపూట భోజనం మానేసి వలస కార్మికులకు భోజనంపెట్టే దుర్భరస్థితి రాష్ట్రంలో నెలకొందంటున్న కార్మికసంఘం నాయకులతో ఈటీవీ భారత్ ముఖాముఖి.