King Cobra: 14 అడుగుల కింగ్ కోబ్రా హల్ చల్ - శ్రీకాకుళం జిల్లాలో కోబ్రా పట్టివేత
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలోని బోగభావి గ్రామంలో సుమారు 14 అడుగుల కింగ్ కోబ్రా హల్చల్ చేసింది. సమీప అటవీ ప్రాంతం నుంచి గ్రామంలోకి వచ్చిన పాము.. బుసలు కొడుతూ శబ్ధాలు చేసింది. గమనించిన స్థానికులు ఆందోళనకు గురయ్యారు. పాములు పట్టే వ్యక్తికి సమాచారం ఇవ్వగా.. చాకచక్యంగా పామును పట్టి సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. గతంలోనూ భారీ కోబ్రాలు గ్రామంలోకి వచ్చాయని.. అధికారులు తగిన చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.
TAGGED:
ap latest news