ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ప్రతిధ్వని: యువత అంకుర ఆలోచనలు..భవిష్యత్తు అవకాశాలు ! - నేటి ప్రతిధ్వని న్యూస్

By

Published : Jan 5, 2021, 9:41 PM IST

నేటి యువత తమలో అంకురించే ఆలోచలనే పెట్టుబడిగా అంకుర సంస్థలను స్థాపిస్తూ..విజయపథంలో దూసుకుపోతున్నారు. అయితే చాలా మంది యువత సోషల్ స్టార్టప్స్​కు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. కొంచెం లాభం, మరికొంత సామాజిక ధృక్పథంతో పారిశ్రామిక వేత్తలుగా రాణిస్తున్నారు. తమలాంటి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. గతంతో పోలిస్తే అంకురాలు స్థాపించే యువత రోజురోజుకూ పెరుగుతోంది. మంచి ఉద్యోగాలను సైతం వదులుకొని సొంతంగా ఎదగడానికి ప్రయత్నిస్తున్నారు. అంకురాలకు ప్రభుత్వాలు అందించే ప్రోత్సాహకాలను అందిపుచ్చుకుంటూ ముందడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేటి యువత అంకుర ఆలోచనలు ఏవిధంగా ఉంటున్నాయి. భవిష్యత్తులో ఎలాంటి అంకురాలకు అవకాశం ఉన్నాయి. ఈ అంశాలకు సంబంధించి ప్రతి ధ్వని ప్రత్యేక చర్చను చేపట్టింది.

ABOUT THE AUTHOR

...view details