రాశి ఫలం: కన్య - ఉగాధి రాశి ఫలాలు
ఆదాయం: 2 , వ్యయం: 11, రాజపూజ్యం: 4, అవమానం: 7 ఈ రాశివారికి ఈ ఏడాది ఆర్థికాభివృద్ధి బాగుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. గతంలో కంటే ఆస్తుల విలువ పెరుగుతుంది. సంతాన పురోగతి మానసిక సంతోషానికి కారణమవుతుంది. వాహన, గృహ యోగం అనుకూల పడతాయి. శుభకార్యాలకు సంబంధించిన విషయాలు సానుకూల పడతాయి. సన్నిహితులతో విభేదాలు సమసిపోతాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి పదవి దక్కే అవకాశం ఉంది. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి అనుకూలంగా ఉంది. ఆదాయానికి మించిన ఖర్చులను అదుపు చేయడంలో విఫలమవుతారు. మార్పు రాని వ్యక్తుల్లో మార్పు కోసం ఎలాంటి ప్రయత్నం చేయకూడదని నిర్ణయించుకుంటారు. ముఖ్యమైన ప్రయాణాలు కొన్ని లభిస్తాయి.. కొన్ని వాయిదా పడతాయి. చాలా అంశాలను మీకు అనుకూలంగా మార్చుకోగలరు. సివిల్, క్రిమినల్ కేసుల్లో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి.