'ఇక్కడ కరోనా బాధితులందరూ కోలుకున్నారు' - ఏలూరు కరోనా వార్తలు
పశ్చిమగోదావరి జిల్లాకు సంబంధించి కరోనా పాజిటివ్ వచ్చిన వారికి ఏలూరు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. 700 పడకలున్న ఈ వైద్యశాలలో ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశారు. జిల్లాలో ప్రస్తుతం 11మంది కొవిడ్ బాధితులు కోలుకుని ఇళ్లకు వెళ్లారని వైద్యులు తెలిపారు. మిగతా 34 మందికి చికిత్స అందిస్తున్నామన్నారు. ఈ ఆసుపత్రిలో కరోనా బాధితులకు చికిత్స ఎలా సాగుతోంది.. కోలుకునే తీరు ఎలా ఉందన్న విషయాలపై సూపరింటెండెంట్ ఏవీఆర్ మోహన్‌తో మా ప్రతినిథి రాయుడు ముఖాముఖి.