హైదరాబాద్‌ను ఇలా ఎప్పుడైనా చూశారా? - hyderabad video during lock down
ఎందెందు వెతికినా అందందు నేనే ఉంటానంటోంది కరోనా.. రోజురోజుకూ విజృంభిస్తున్న ఈ వైరస్‌తో ప్రజలు ప్రతిక్షణం వణికిపోతున్నారు. పర్యటకులతో కళకళలాడే హైదరాబాద్... ఇప్పుడు నిర్మానుష్యమై మూగబోయింది. నిత్యం రద్దీగా ఉండే నెక్లెస్ రోడ్, రింగ్ రోడ్, జాతీయ రహదారులన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. తెలంగాణకే తలమానికమైన ట్యాంక్ బండ్, చార్మినార్.. నిశ్శబ్ధపు నీలిఛాయలు అలముకున్నాయి. సందడిగా ఉండే సచివాలయం.. కొవిడ్-19తో కళ తప్పింది.