మన్యంలో చలి ఓ వైపు.. పొగమంచు అందాలు మరోవైపు - విశాఖ ఏజన్సీలో చలి తీవ్రత వార్తలు
మన్యంలో చలి పంజా విసురుతోంది. చింతపల్లిలో మంగళవారం ఉదయం అత్యల్పంగా 9.2 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రత పెరగడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో జనసంచారం తగ్గుముఖం పడుతోంది. మరోవైపు పొగమంచుతో మన్యం అందాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఏజెన్సీకి పర్యాటకుల తాకిడి పెరిగింది. రానున్న రోజుల్లో చలితీవ్రత మరింతగా పెరిగే అవకాశమున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.