Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. హనుమంత వాహనంపై ఊరేగిన గోవిందుడు - తిరుమల బ్రహ్మోత్సవాలు 2021
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి హనుమంత వాహనసేవ నిర్వహించారు. హనుమంత వాహనంపై శ్రీనివాసుడు భక్తులకు అభయప్రదానం చేశారు. వాహనసేవలో తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొవిడ్ నిబంధనల నేపథ్యంలో ఆలయంలోని కల్యాణ మండలంలో వాహన సేవలు నిర్వహిస్తున్నారు.