కండ్లకుంట ఇష్టాకామేశ్వరికి పుష్పాలంకరణ - గుంటూరులో కండ్లకుంట ఇష్టాకామేశ్వరికి పుష్పాలంకరణ
కార్తీకమాసం చివరిరోజు పూలపాడ్యమి పర్వదినాన గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కండ్లకుంట ఇష్టకామేశ్వరిస్వామి ఆలయంలో ఉత్సవాలు ఘనంగా జరిగాయి. 14 క్వింటాళ్ల పూలతో ఆలయాన్ని, దేవతామూర్తులను శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఇక్కడ కొలువైన ఇష్టకామేశ్వరస్వామిని 11 రకాల పండ్లతో అందగా అలంకరించారు. పార్వతీదేవి అమ్మవారు వారాహి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.