తిరుమలలో కన్నులపండువగా శ్రీవారి తెప్పోత్సవం
కోనేటిరాయుని తెప్పోత్సవాలు తిరుమలలో కన్నుల పండువగా సాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మూడవ రోజు స్వామివారు.. అమ్మవార్లతో కలసి తిరుచ్చి వాహనంపై తిరువీధుల్లో ఊరేగింపుగా పుష్కరిణికి చేరుకున్నారు. కోనేటిలో నిర్మించిన తెప్పపై శ్రీదేవీ, భూదేవీ సమేతంగా ఆశీనులైన స్వామివారు మూడు మార్లు ప్రదక్షిణంగా విహరించారు. పరిమళభరిత పూలమాలలతో ఆలంకారభూషితులైన ఉత్సవమూర్తులను దర్శించుకున్న భక్తులు.. కర్పూర హారతులు సమర్పించారు.