ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వైభవంగా గొల్లలమామిడాడ కోదండ రామచంద్రుడి ఆలయ సంప్రోక్షణ - east godavari news

By

Published : Jun 19, 2021, 2:21 PM IST

తూర్పుగోదావరి జిల్లా గొల్లలమామిడాడలో కోదండ రామచంద్రుడి ఆలయ సంప్రోక్షణ కార్యక్రమం వైభవంగా జరిగింది. ముందుగా విశ్వక్సేన పూజ పుణ్యాహవహనం నిర్వహించారు. మేళతాళాల నడుమ వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఆలయానికి ఈశాన్యంగా ఉన్న పుష్కరిణివద్ద నది జలాలను సేకరించి ఆలయంలో ఆకాశగంగా తదితర జలలను కలిపి.. ఒక కలశంలోకి తీసుకొని ఆలయంలో సంప్రోక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఆలయ ధర్మకర్త ద్వారంపూడి శ్రీరామమురళీకృష్ణ శ్రీనివాసరెడ్డి సతీసమేతంగా ఆలయ గోపురాలకు అభిషేకం నిర్వహించారు. కరోనా కేసులు తగ్గి అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఆలయ అర్చకుడు మంజునాథచార్యులు చెప్పారు. కరోనా కారణంగా ఏకాంతంగా కార్యక్రమాన్ని నిర్వహించామని ఆయన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details