ప్రమాదకర ప్రయాణం..మోపెడ్‌పై రైతు విన్యాసం - రైతు ప్రమాదకరం
అతివేగం ఎంత ప్రమాదకరమో...అధిక లోడు కూడా అంతే ప్రమాదం. కొందరు ఆ విషయాన్ని పెడచెవిన పెట్టి వాహనాలు నడుపుతుంటారు. గుంటూరు నగర శివార్లలో అలాంటి దృశ్యమే కనిపించింది. ఓ పాడిరైతు తన మోపెడ్ వాహనం నిండా పశుగ్రాసం మోపులు వేసుకున్నారు. బండికి చిట్ట చివర్లో కూర్చుని..,గడ్డిమోపులపై సాగిలబడి ప్రమాదకరంగా వాహనం నడుపుతూ కనిపించాడు. రోడ్డుపై గుంతలు కనిపించే అవకాశం లేకపోగా..అదుపు తప్పితే ప్రాణాలు గాల్లో కలిసిపోవటం ఖాయం. అవేమీ పట్టని రైతు ప్రమాదకరంగా ప్రయాణాన్ని కొనసాగించాడు.