ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ప్రతిధ్వని: భారత ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం ఎంత..?

By

Published : Jul 31, 2020, 11:05 PM IST

కరోనా సంక్షోభానికి ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ చిన్నాభిన్నమయ్యాయి. అమెరికా, మెక్సికో, జర్మనీ లాంటి దేశాల ఆర్థిక వ్యవస్థలు పతనమవుతున్నాయి. నిరుద్యోగ రేటు తీవ్రంగా పెరిగిపోతోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ.. ఏప్రిల్​-జూన్​ త్రైమాసికంలో 33 శాతం వార్షిక రేటుతో క్షీణించింది. ఒక త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ ఇంత దారుణంగా పడిపోవడం అగ్రరాజ్యం చరిత్రలో తొలిసారి. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్​లో ఎన్నడూ లేనంతగా తక్కువ వృద్ధిరేటు నమోదవుతుందని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలపై కరోనా ఎలాంటి సవాళ్లను విసురుతోంది. భారత ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది. కొవిడ్​ వ్యాప్తికి ముందున్న స్థాయిని అందుకోవడానికి ఇంకా ఎంతకాలం పడుతుంది. ఈ అంశాలపై ప్రతిధ్వని...

ABOUT THE AUTHOR

...view details