ప్రతిధ్వని: దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవ'సాయం' ఎంత? - agriculture supporting to indian economy
కరోనా సంక్షోభ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై కనీవినీ ఎరుగని రీతిలో పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రభావ తీవ్రతను వ్యవసాయ రంగం కొంతమేర తగ్గించగలదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ నివేదిక వెల్లడించింది. లాక్డౌన్ ఆంక్షలు ఉన్నప్పటికీ వ్యవసాయ రంగానికి ఇచ్చిన మినహాయింపులు రికార్డు స్థాయి పంట దిగుబడికి ఎంతో కలిసి వచ్చాయి. దేశ వృద్ధిని ముందుకు తీసుకువెళ్లడంలో గ్రామీణ ప్రాంతాలు కీలకపాత్ర పోషిస్తాయని ఆర్థిక శాఖ నివేదిక పేర్కొంది. సానుకూల వర్షపాత అంచనాలతో ఆహార ధాన్యాల లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఈ నేపథ్యంలో కరోనా సంక్షోభం వేళ దేశఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం ఏ స్థాయిలో అండగా నిలుస్తుందనే అంశంపై ప్రతిధ్వని చర్చ..