Prathidwani: ప్రజా ప్రతినిధులపై నమోదైన కేసుల సత్వర విచారణ ఎలా? - etv bharat debate
దేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలపై వేల సంఖ్యలో పెండింగ్ కేసులు పేరుకుపోతున్నాయి. ప్రజా ప్రతినిధులపై నమోదైన వందలాది కేసుల్లో ఐదు, పదేళ్లు దాటినా విచారణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏళ్లకేళ్లుగా పెండింగ్‌లో పేరుకుపోతున్న కేసులను సత్వరమే పరిష్కరించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. అసలు ప్రజాప్రతినిధులపై కోర్టు కేసుల విచారణలో జాప్యం ఎందుకు జరుగుతోంది? ఏటికేడు నేరచరితుల సంఖ్య ఎందుకు పెరుగుతోంది? తెలుగు రాష్ట్రాల్లో పెండింగ్ కేసుల విచారణ ఎలా జరుగుతోంది? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.