ప్రతిధ్వని: నీ(నే)టి వృథా... రేపటి వ్యథ - ఈరోజు ప్రతిధ్వని చర్చా
ప్రపంచవ్యాప్తంగా జలసంక్షోభం రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఈ భూమండలం పైనే అత్యధికంగా జలాలను వినియోగిస్తున్న భారతదేశంలో అరవై కోట్ల మంది నీటి కొరతతో తల్లడిల్లుతున్నారు. జీవ నదులు ఉప్పొంగే విశాల దేశం.. అపారమైన జలరాశులతో అలరారుతున్నా... వాటిని సకాలంలో ఒడిసిపట్టుకునే నేర్పు కొరవడింది. ఫలితంగా గుక్కెడు నీటికోసం మైళ్ల కొద్దీ నడిచే దుస్థితిని చూస్తున్నాం. ఒకవైపు పోటెత్తే వరదలు... ఇంకోవైపు నీటికోసం అంగలార్చే పరిస్థితి. ఇలాంటి తరుణంలో... నేడు ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా... దేశంలో నీటి సంరక్షణకు తక్షణం చేపట్టాల్సిన కార్యాచరణపై ఈరోజు ఈటీవీ భారత్ ప్రతిధ్వని చర్చా కార్యక్రమం.