ప్రతిధ్వని: రానున్న రోజుల్లో ఎరువుల ధరల పరిస్థితి ఎలా ఉండొచ్చు.? - ఎరువుల ధరలు పెంపు
రైతన్నలకు ఎరువుల పిడుగు ప్రమాదం త్రుటిలో తప్పింది. కనిష్ఠంగా రూ.125 నుంచి గరిష్ఠంగా రూ.700 మేర భారం మోపిన ఎరువుల సంస్థల నిర్ణయానికి కేంద్రం తాత్కాలికంగా బ్రేకులు వేసింది. అత్యున్నత స్థాయి సమావేశం.. అనంతరం కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి ప్రకటనతో ఊరట లభించినట్లు కనిపిస్తున్నా... అది ఎంతకాలం? ఇప్పుడు అన్నదాతలు, రైతుసంఘాల నుంచి వస్తోన్న ప్రశ్న ఇదే. కేంద్రం ఆదేశాల మేరకు చూస్తే... ఎరువుల ధరల పెంపు నిర్ణయం విరమించుకున్నట్లేనా? లేక కొంత విరామం ఇచ్చి... పెంపుదలపై రైతుల్ని మానసికంగా సన్నద్ధం చేస్తున్నారా? రానున్న రోజుల్లో ఎరువుల ధరల పరిస్థితి ఎలా ఉండొచ్చు? ఇదే అంశంపై ప్రతిధ్వని చర్చ.