ప్రతిధ్వని: ఆత్మనిర్భర్ భారత్ @ ఉద్యోగ కల్పనకు ఊతం - bharat debate
కోవిడ్ సంక్షోభంతో కుదేలవుతున్న దేశ ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం కలిగించేందుకు.. కేంద్ర ప్రభుత్వం మరో ఉద్దీపన ప్రకటించింది. ఆత్మ నిర్భర్ భారత్ 3 పేరుతో.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. మరిన్ని ప్రోత్సాహకాలు ప్రకటించారు. దేశంలో ఉపాధి అవకాశాలు పెంచేందుకు ఆత్మ నిర్భర్ భారత్ రోజ్ గార్ యోజన తీసుకొచ్చారు. దేశీయ ఉత్పత్తికి ఊతమిచ్చేలా.. 1.46 లక్షల కోట్ల రూపాయలతో ప్రోత్సాహకాల్ని ఇవ్వనున్నారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం కింద మరో 10 రంగాలను తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తాజా ఉద్దీపన.. తయారీ రంగానికి ఎలాంటి ఊతం ఇస్తుంది? ఏ స్థాయిలో ఉద్యోగ, ఉపాధి కల్పన అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంది? ఈ అంశాలపై ప్రతిధ్వని చర్చ.