'ఈ జాగ్రత్తలు పాటిస్తే తల్లిపాల ద్వారా కరోనా వ్యాప్తి చెందదు' - రాష్ట్రంలో కరోనా వ్యాప్తి వార్తలు
కరోనా బారిన పడకుండా మూత్రపిండ వ్యాధిగ్రస్థులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని... వారికి అత్యవసరమైన డయాలసిస్ వంటివి అంతరాయం లేకుండా అందేట్టు చూసుకోవాలని ప్రముఖ వైద్య నిపుణులు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి రవిరాజ్ వెల్లడించారు. శిశువులకు తల్లి పాల ద్వారా ఇది సంక్రమించదని ఆయన స్పష్టం చేశారు. బలవర్ధకమైన వేడి ఆహారం తీసుకోవడమే కాకుండా అవసరమైన విటమిన్ సప్లిమెంట్ కూడా వినియోగించాలని సూచిస్తున్న డాక్టర్ రవిరాజ్ తో ఈటీవీ భారత్ ముఖాముఖి.