'కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నాం.. జాగ్రత్తగా ఉందాం' - ఏపీలో కరోనా కేసుల వార్తలు
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తెలియని శత్రువుతో యుద్ధం చేస్తున్నామని సన్షైన్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్. గురువారెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ యుద్ధ సమయంలో ఉన్నారన్న విషయాన్ని మరవకూడదని చెప్పారు. ప్రజల కోసం డాక్టర్లంతా రాత్రింబవళ్లు పని చేస్తున్నారని గుర్తు చేశారు. ప్రజలు చేయాల్సిందల్లా ఇంట్లో ఉండటమే అని అభిప్రాయపడ్డారు. ఇంట్లో ఉండటం వల్ల ఎవర్ని వారు కాపాడుకోవటమే గాక... మరెంతో మందిని కాపాడిన వారవుతారని చెప్పారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి చేతులు కడుక్కోవాలని సూచించారు.