నిరాశ్రయులకు ఆశ్రయం.. అధికారుల ఆపన్నహస్తం
లాక్డౌన్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరాశ్రయులకు.. ఆశ్రయం కల్పిస్తున్నారు నెల్లూరు జిల్లా అధికారులు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నెల్లూరు నగరంలో 38 కేంద్రాలు ఏర్పాటు 1150 మందికి భోజనం, వసతి కల్పించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మెప్మా నుంచి 100 మంది ఉద్యోగులు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో భోజనం అందిస్తున్నారు. ఈ కేంద్రాలపై ఈటీవీ భారత్ కథనం.