రాష్ట్రవ్యాప్తంగా దీపావళి సంబరాలు
రాష్ట్రవ్యాప్తంగా దీపావళి పర్వదినాన్ని ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. వెలుగు జిలుగుల దీపావళిని పురస్కరించుకుని..చిన్నాపెద్ద అంతా ఎంతో సంతోషంగా టపాసులు కాలుస్తున్నారు. కొవిడ్ నేపథ్యంలో హరిత ట్రైబ్యునల్ మార్గదర్శకాల మేరకు దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు జరుపుకుంటున్నారు. కాలుష్యానికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో పలు ప్రాంతాల్లో...పర్యావరణహిత బాణాసంచాలను ఉపయోగిస్తున్నారు.