prathidwani: గుండె లయ తప్పుతోందా? ఎలా కాపాడుకోవాలి
యుక్తవయసులోనే గుండె లయ తప్పుతోంది. నిర్విరామంగా ధ్వనించాల్సిన హృదయ స్పందనలకు మూడు పదులు దాటగానే అకస్మాత్తుగా బ్రేకులు పడుతున్నాయి. ఫలితంగా వ్యాయామం చేస్తూనే... మైదానాల్లో ఆటలు ఆడుతూనే ఆరోగ్యవంతులు సైతం హఠాత్తుగా మరణిస్తున్నారు. జీవితాంతం విరామం లేకుండా కొట్టుకోవాల్సిన గుండె అర్దాంతరంగా ఎందుకు ఆగిపోతోంది? గతితప్పిన జీవనశైలి, శృతిమించిన వ్యాయామంతో గుండెకు ఏర్పడుతున్న ముప్పు ఏంటి? ఇదే అంశంపై ప్రతిధ్వని.