ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

'అమ్మ తొలిదైవం' ఆధ్వర్యంలో ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన - dance performance under Amma Tholidayam Cultural Society latest news update

🎬 Watch Now: Feature Video

By

Published : Mar 12, 2021, 11:45 AM IST

అనంతపురం జిల్లావ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయా ఆలయాల్లో శివుడికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు. అనంతరం భజన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉరవకొండలో 'అమ్మ తొలిదైవం' సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో చిన్నారులు చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం వూలపల్లి శ్రీ బాలా త్రిపురసుందరి సమేత అగస్తేశ్వర స్వామి వారి దేవాలయంలో మహాశివరాత్రి పూజలు భక్తి శ్రద్దలతో జరిపారు. స్వామి వారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలి వచ్చారు. ఆలయ పరిసరాలు, కోనేటిని దీపాలతో అలంకరించారు. అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి సతీసమేతంగా కోనేటిలో దీపాలు వదిలి, ప్రత్యేక పూజలు చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details