రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబు బైఠాయింపు - తిరుపతి తాజా వార్తలు
రేణిగుంట విమానాశ్రయంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చిత్తూరు, తిరుపతిలో తలపెట్టిన నిరసనలో పాల్గొనేందుకు వెళ్లిన తెలుగుదేశం అధినేత చంద్రబాబును.. అనుమతి లేదంటూ పోలీసులు ఎయిర్ పోర్టులోనే ఆపేశారు. దాదాపు 4 గంటలుగా ఆయన విమానాశ్రయంలోనే ఉన్నారు. ఈ పర్యటన వల్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయని, కొవిడ్ నిబంధనలు ఇంకా అమల్లో ఉన్నాయని, జనజీవనానికి ఆటంకం కలుగుతుందంటూ... రేణిగుంట పోలీసులు చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు. ఆయన్ను విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. అక్కడై బైఠాయించి నిరసన తెలిపారు.
Last Updated : Mar 1, 2021, 2:17 PM IST