శంబర పోలమాంబ ఆలయంలో వేడుకగా సిరిమానోత్సవం - SIRIMANOSTAVAM
విజయనగరం జిల్లా మక్కువ మండలం శంబర పోలమాంబ జాతరలో ముఖ్య ఘట్టమైన సిరిమానోత్సవం మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రారంభమైంది. పూజారి సిరిమాను అధిరోహించగ.... భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. బస్సులు లేక పోయినా సొంత వాహనాల ద్వారా సుమారు లక్ష మంది భక్తులు తరలివచ్చి... అమ్మవారిని దర్శించుకున్నారు. కరోనా దృష్ట్యా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ అమ్మవారి దర్శనానికి వీలు కల్పించారు.