ప్రతిధ్వని: స్కూళ్లు తెరిస్తే ముప్పేనా? - లాక్ డౌన్
దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొత్త విద్యా సంవత్సర భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. విద్యా సంస్థల పున:ప్రారంభంపై అటు ప్రభుత్వాలు, ఇటు ప్రైవేట్ యాజమాన్యాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. పిల్లల చదువులపై తల్లిదండ్రుల్లోనూ తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో.. అసలు విద్యా సంస్థలు తెరుచుకునే పరిస్థితి ఉందా? తెరిస్తే ఎలాంటి నిబంధనలు, జాగ్రత్తలు తప్పనిసరి? విద్యార్థులకు ముప్పు లేకుండా తరగతులు నిర్వహించడం సాధ్యమేనా? ఆన్లైన్ క్లాసులు ఎంతవరకూ ఆచరణీయం? ఈ అంశంపై ఈటీవీ ప్రతిధ్వని చర్చ.