ఎత్తిపోతల జలపాతం.. సరికొత్త అందాలు - గుంటూరులో ఎత్తిపోతల జలపాతం అందాలు
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని వాగులు పొంగి పొర్లుతున్నాయి. వాగుల్లోని నీరంతా పర్యాటక ప్రాంతమైన మాచర్ల మండలంలోని ఎత్తిపోతలకు చేరుతుంది. దీంతో ఇక్కడి జలపాతం కొత్త అందాలు సంతరించుకుంది. చిరుజల్లులు.. జలపాతం హొయలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఎత్తిపోతల అందాలు తిలకించేందుకు ప్రకృతి ప్రేమికులు ఆసక్తి చూపుతున్నారు.