ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఈ పూల సొగసు ఎక్కడో తెలుసా..! - అమరావతి మల్కాపురం పార్కు తాజా వార్తలు

By

Published : Feb 27, 2021, 11:40 AM IST

Updated : Feb 27, 2021, 8:27 PM IST

ఈ దృశ్యాల్ని చూసి ఇదేదో విదేశాల్లో కనిపించే ప్రకృతి అందం అనుకుంటే పొరపాటే. రాజధాని అమరావతిలోని మల్కాపురం పార్కులోనివే ఈ పువ్వులు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో సచివాలయం భవన సముదాయాల ప్రధాన ద్వారానికి ఎదురుగా అమరావతి అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్నవే ఈ అందాలు. మల్కాపురం పార్కులోని ఈ కొండగోగు పూల మొక్కలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. వీటిని కడియం నుంచి తీసుకొచ్చారు. అర కిలోమీటరు మేర ఇరువైపులా నాటారు. ఇవి ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఆకులు లేకుండా అరచేతి సైజులో అందమైన పసుపురంగు పూలను పూస్తాయి.
Last Updated : Feb 27, 2021, 8:27 PM IST

ABOUT THE AUTHOR

...view details