అబ్బురపరుస్తున్న 100 మీటర్ల సంక్రాంతి ముగ్గు - sankranti festival
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 15, 2024, 9:38 PM IST
|Updated : Jan 22, 2024, 8:17 PM IST
Sankranti Special Muggu:కృష్ణా జిల్లా మోపిదేవి మండలం రావివారిపాలెంలో వేసిన 100 మీటర్ల భారీ సంక్రాంతి ముగ్గు ఆకట్టుకుంది. ముగ్గురు మహిళలు, ముగ్గురు మగవారు ఒక రోజంతా కష్టపడి ఈ భారీ ముగ్గు వేశారు. గొబ్బెమ్మలు, అరటి పిలకలు, నవదాన్యాలు, బసవన్నలు, కోడి ఇలా సంక్రాంతికి సంబంధించిన అన్ని అంశాలను ఈ ముగ్గులో ప్రతిబింబ చేశారు. కనుమరుగవుతున్న సంప్రదాయాలను నేటితరానికి అందించేందుకే ఈ భారీ ముగ్గు వేసినట్లు రావి జయశ్రీ తెలిపారు. ముగ్గు వేయడానికి రూ. 20 వేల ఖర్చు వచ్చిందని వెల్లడించారు.
తాము గత 15 సంవత్సరాలుగా పెద్ద పెద్ద ముగ్గులు వేస్తున్నామని రావి జయశ్రీ తెలిపారు. అయితే ఇంత పెద్ద ముగ్గును వేయడం ఇదే మెుదటి సారి అని తెలిపారు. ముఖ్యంగా యువతులకు ముగ్గులపై అవగాహన కల్పించడం కోసం ఈ ప్రయత్నం చేసినట్లు పేర్కొన్నారు. యువతలో ముగ్గుల పట్ల ఆసక్తి పెంచడానికే ఇలా వినూత్నంగా ముగ్గును వేసినట్లు రావి జయశ్రీ వెల్లడించారు. ఇంత పెద్ద ముగ్గు వేయడానికి నెల ముందు నుంచే ప్రణాళికలు తయారు చేసినట్లు జయశ్రీ పేర్కొన్నారు.