Prathidwani: రూపాయి విలువ పతనానికి తక్షణ కారణాలేంటి ?..ఆపేదెలా ? - ప్రతిధ్వని తాజా వార్తలు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సృష్టిస్తున్న ప్రకంపనలు భారత రూపాయి విలువ పతనానికి దారితీస్తున్నాయి. యుద్ధ భయాల మధ్య అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థల్లో ఏర్పడిన ప్రతిష్టంభనలు సరుకుల ఎగుమతులు, దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఈ మేరకు పెరుగుతున్న చమురు ధరలు.., సరుకుల ధరల పెరుగుదలకు ఆజ్యం పోసున్నాయి. ఈ పరిస్థితుల మధ్య పతనమవుతున్న రూపాయి ఎదుర్కొంటున్న కష్టాలు ఏంటి ? ఈ పతనం ఎందాక కొనసాగుతుంది ? మన రూపాయ పతనాన్ని అడ్డుకునేందుకు ఎలాంటి చర్యలు అవసరం ? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:19 PM IST