కరెంట్ కోతలతో ఉక్కిరిబిక్కిరి.. సామాన్యు ప్రజలకేనా ఈ సమస్యలు!
కరెంట్ కోతల కష్టాలు రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నిన్నటి వరకు అమలు చేసిన అప్రకటిత కోతలు ఇప్పుడు అధికారికం కూడా అయిపోయాయి. పరిశ్రమలకు వారానికి ఒకరోజు పవర్ హాలిడే ప్రకటించారు. ప్రాసెసింగ్ పరిశ్రమలు కూడా కేటాయించిన విద్యుత్‌లో 50 శాతమే వాడాలని హుకూం జారీ చేశారు. చాలినంత మిగులు విద్యుత్, ఇంధన నిర్వహణలో దేశంలోనే నంబర్ స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్.. ఇప్పుడు కనీసం ఆస్పత్రులకు కావాల్సిన విద్యుత్‌నూ ఎందుకు అందించలేకపోతోంది? ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని కరెంట్‌తో రైతులు, సామాన్యప్రజలు ఎన్నో ఇక్కట్లు ఎందుకు ఎదుర్కోవాల్సి వస్తోంది..? ఇదే అంశంపై నేటి ఈటీవీ భారత్ ప్రతిధ్వని..
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST