Prathidwani: మెడిసిన్‌కి విదేశాల్లో ఉన్న అవకాశాలు ఏంటి.. భారత్‌లో ఎలా ఉన్నాయి.. ? - higher education at abroad
మన దేశంలో వైద్య వృత్తికున్న గౌరవం చాలా ఉన్నతమైనది. అందుకే చాలామంది మెడిసిన్ చదివేందుకు తహతహ లాడుతుంటారు. ప్రపంచంలో ఏ మూలన మెడిసిన్ చదివే అవకాశం లభించినా వదులుకోరు. ఇలానే ఉక్రెయిన్‌లో మెడిసిన్ చదివేందుకు వెళ్లిన వేలాది మంది భారతీయులు ఇప్పుడు భీకర యుద్ధంలో చిక్కుకున్నారు. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని సరిహద్దులు దాటేందుకు కష్టాలు పడుతున్నారు. అసలు వీళ్లందరికీ మన దేశంలో మెడిసిన్ చదివే అవకాశం ఎందుకు లభించలేదు? మధ్య ఆసియా, తూర్పు ఐరోపా, ఆగ్నేయాసియా దేశాల్లో విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయి? మన దేశంలో ఉన్నత విద్యా ప్రమాణాలు పెంచుకోవడం ఎలా? ఇదే అంశంపై ఈ రోజు ప్రతిధ్వని..
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST