PRATHIDWANI: భవిష్యత్‌లో తులం బంగారం ధర రూ.లక్ష దాటుతుందా..! - ప్రతిధ్వని సమయం
బంగారం ధరలు రోజురోజుకీ ఆకాశాన్నంటుతున్నాయి. సామాన్యుడికి అందుబాటులో లేకుండా పైపైకి ఎగబాకుతున్నాయి పసిడి పరుగులు. అంతేనా... రానున్న రోజుల్లో సామాన్యులు గ్రాము బంగారం కొనడం కూడా గగనమే అన్న అంచనాలు గుబులు రేపుతున్నాయి. భవిష్యత్‌లో 10 గ్రాముల బంగారం ధర 70వేలు... 80వేల మార్కును కూడా దాటేసి లక్ష రూపాయలు చేరవచ్చన్న అంచనాల్లో నిజం ఎంత? ఈ సమయంలో ప్రజల ముందున్న మార్గం ఏమిటి? కొనాలా ఆగాలా? కొంటే... ఏ రూపంలో, ఎంత మేరకు తీసుకుంటే మేలు? బంగారం ధరలు దిగి వచ్చే అవకాశం ఎప్పటికి? రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత భారీగా పెరిగే అవకాశం ఉందా. ఈ దూకుడు ఎప్పటి వరకు... రానున్న ఏడాది, రెండేళ్ల కాలనికి ఎలా మారొచ్చు గోల్డ్ ధరలు? అసలు దేశంలో బంగారం ధరల నిర్ణయం ఎలా జరుగుతుంది? రోజువారీ ధరలను ఎవరు... ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తారనేది సామాన్యులు చాలామందిలో ఉండే ప్రశ్న? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.