Prathidwani: ఇకనైనా ప్రభుత్వం తీరు మార్చుకుంటుందా..? - ఈటీవీ భారత్ డిబేట్
Prathidwani: అమరావతి రాజధాని విషయంలో హైకోర్టు తీర్పు రైతుల ఉద్యమానికి నైతిక బలం చేకూర్చింది. సీఆర్డీఏను రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తేల్చిచెప్పింది. రాజధాని కార్యాలయాల తరలింపుతో సహా అన్ని అంశాలపై తదుపరి ఉత్తర్వులొచ్చేవరకు రిట్ ఆఫ్ మాండమస్ కొనసాగుతుందని ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి అమరావతి రాజధాని భాగస్వాముల ప్రాథమిక హక్కులను కాలరాసేలా ఉందని ఆక్షేపించింది. న్యాయస్థానం తీర్పుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకే రాజధాని కోసం జరుగుతున్న ప్రజాపోరాటం బలంగా ముందుకు అడుగేసింది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పును అనుసరించి సీఆర్డీఏ చట్టం అమలుకు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలేంటి? అమరావతి రైతులు, రాజధాని భాగస్వాములకు అందాల్సిన హక్కులేంటి? ఇదే అంశంపై ఈటీవీ భారత్ ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST