ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Rajendra_Prasad_on_Panchayat_Funds

ETV Bharat / videos

పంచాయతీ నిధులను మరోసారి రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించింది: వైవీబీ రాజేంద్రప్రసాద్ - cm jagan

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 12, 2024, 7:02 PM IST

YVB Rajendra Prasad on Panchayat Funds: నాలుగు రోజుల క్రితం గ్రామాల అభివృద్ధికి కేంద్రం పంపిన 988 కోట్లు రూపాయల నిధులు రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించాలని చూస్తోందని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్  రాష్ట్ర అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. ఇప్పటికే దొంగిలించిన 600 కోట్ల రూపాయలను 4 రోజులలో గ్రామ పంచాయతీల, మండల పరిషత్తుల, జిల్లా పరిషత్​ల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో రాజకీయాలకతీతంగా సర్పంచులు, ఎంపీటీసీలు జడ్పీటీసీలతో కలిసి తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు. 

15వ ఆర్థిక సంఘం ద్వారా 2022-23వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రెండో విడత నిధులు 988 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినట్లు తమకు స్పష్టమైన సమాచారం ఉందని వైవీబీ అన్నారు. కానీ కేంద్రం పంపిన 988 కోట్ల రూపాయలలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం 393 కోట్ల రూపాయలు మాత్రమే గ్రామ పంచాయతీ ఖాతాల్లో జమ చేసిందని తెలిపారు. మిగిలిన 600 కోట్ల రూపాయలను పంచాయతీలకు ఇవ్వకుండా దారి మళ్లించేసిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ దారుణాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘం వ్యతిరేకిస్తోందన్నారు. గతంలో కూడా ఇదే విధంగా 8 వేల 629 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఆ నిధులు ఇవ్వకపోగా తాజాగా మరో 600 కోట్లు దారి మళ్లించడం దారుణమని మండిపడ్డారు. 

ABOUT THE AUTHOR

...view details