Yuvagalam volunteers released from Jail రాజమండ్రి కారాగారం నుంచి విడుదలైన యువగళం వాలంటీర్లు.. గత నెల రోజులుగా జైల్లోనే - వైసీపీ నేతలపై టీడీపీ ఆరోపణలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 7, 2023, 4:45 PM IST
Yuvagalam volunteers released from Rajahmundry Central Jail: రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి యువగళం వాలంటీర్లు విడుదలయ్యారు. 39 మంది యువగళం వాలంటీర్లు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం(Central Jail) నుంచి విడుదలై తెలుగుదేశం క్యాంపు కార్యాలయం వద్దకు వచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, బేతపూడి యువగళం పాదయాత్ర శిబిరం నుంచి పోలీసులు గత నెల 6న యువగళం వాలంటర్లను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. నేడు విడుదలైన యువగళం వాలంటీర్లు మీడియాతో మాట్లాడారు.
లోకేశ్ పాదయాత్ర కోసం తామంతా స్వచ్ఛందంగా సేవలు అందించామని వాలంటీర్లు తెలిపారు. అయితే, కొన్నిచోట్ల అధికార పార్టీ శ్రేణులు ఆటంకాలు సృష్టించారని పేర్కొన్నారు. వైసీపీ నేతలు, కార్యకర్తలను ధైర్యంగా ఎదుర్కొన్నామని వాలంటీర్లు (volunteers) తెలిపారు. భీమవరంలో లోకేశ్(Lokesh) పై విసిరిన రాళ్లు, కోడిగుడ్లను అడ్డుకున్నామని.. అందుకే తమపై కేసులు పెట్టారని రవినాయుడు అన్నారు. మరో ముగ్గురు వాలంటీర్లు జైలులో ఉన్నారని చెప్పారు. ఎమ్మెల్యేలు చినరాజప్ప, రామరాజు, తెలుగుదేశం లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే చిన్నరాజప్పు మాట్లాడుతూ... కేవలం కక్షపూరితంగా పెట్టిన కేసులు మాత్రమే అని.. ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేశ్ పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. వాలంటీర్లపై దాడి చేసిన వైసీపీ(YCP) నేతలు, కార్యకర్తలు తిరిగి వారిపైనే కేసులు పెట్టారని చినరాజప్ప విమర్శలు గుప్పించారు.